World Happy Day: ప్రపంచంలో ఆనందంగా ఉండే దేశం అదే... భారత్ స్థానం ఎంతంటే...
World Happy Day: ప్రపంచంలో ఆనందానికీ ఓ రోజు ఉంది. ఎందుకంటే... ఆనందంగా ఉండటం అనేది అత్యవసరం. ఆనందంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. చురుగ్గా పనులు చేసుకోగలుగుతాం. ఊసురోమని ప్రజలుంటే దేశమే గతి బాగుపడునోయ్... అన్నట్లుగా... ప్రజలు ఆనందంగా ఉంటేనే... దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఐతే... ప్రస్తుతం కరోనా కాలం. అయినప్పటికీ కొన్ని దేశాల్లో ఆనందం అలాగే ఉంది. వాటిలో టాప్ ప్లేస్‌లో నిలిచింది యూరప్ దేశం ఫిన్‌లాండ్ (Finland). ఈ సంవత్సరం... ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉన్న ప్రజలున్న దేశం ఏదంటే ఫిన్‌లాండ్ పేరే మనం చెప్పుకోవాలి. ఇవాళ అంతర్జాతీయ ఆనంద దినోత్సవం కావడంతో... ప్రపంచ ఆనంద నివేదిక -2021ని ఐక్యరాజ్యసమితి (ఐరాస - United Nations Organisation) రిలీజ్ చేసింది.మరి ఈ లిస్టులో ఇండియా టాప్ 139వ స్థానంలో ఉంది. మొత్తం ఈ లిస్టులో ఉన్న దేశాలే 149. వాటిలో కింది నుంచి టాప్ 10లో భారత్ నిలవడం... భారతీయులకు విచారకరమే.
యూరప్‌లోని ఫిన్‌లాండ్, నెదర్లాండ్, డెన్మార్క్ వంటి దేశాలు... ఎప్పుడూ టాప్ ప్లేస్‌లో నిలుస్తుంటాయి. ఫిన్‌లాండ్ ఏకంగా నాలుగోసారి ఈ స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా ఐస్‌లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ యుద్ధాల్లో పెద్దగా పాల్గొనలేదు. అందువల్ల వీటికి పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదు. పైగా ఈ దేశాల్లో జనాభా చాలా తక్కువ. అందువల్ల ఇక్కడి వారికి అన్ని వసతులూ చక్కగా లభిస్తున్నాయి.
No comments