Black pepper : కరోనాకి మంచి విరుగుడు నల్ల మిరియాలుతో....
కింగ్ ఆఫ్ స్పైసెస్ గా పిలువబడే మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కేవలం నల్లవే కాదు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లోనూ లభిస్తున్నాయి. సాధారణంగా మన దేశంలో తెల్ల, నల్ల మిరియాలను మాత్రమే వాడుతుంటారు. వంటలకు ఎంతో రుచిని, ఘుమఘుమలను అందించే మిరియాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
మిరియాలలో ఉండే పైపెరైన్ అనే గుణం ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మిరియాల్లో అధికంగా ఉండే పెపెరైన్ అనే ఆల్కలాయిడ్ జీర్ణవ్యవస్థలో ఎక్కువ మొత్తంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్నివిడుదల చేస్తుంది. ఇది మనం తీసుకున్న ఆహారంలోని ప్రొటీన్లు ఈజీగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్, విరేచనాలు సమస్యలు తగ్గిపోతాయి. కాబట్టి మిరియాలను రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
ఆకలిగా తక్కువగా వుండే వారు ఒక టేబుల్ స్పూన్ బెల్లంలో అరచెంచా మిరియాల పొడి కలిపి రోజూ తీసుకుంటే.. ఆకలి పెరుగుతుంది. చిన్న పిల్లల్లో లేదా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా దగ్గు, జబులు వస్తూ ఉంటుంది. ప్రతిసారి మందులు వాడటం మంచిది కాదు. అందుకే మిరియాల పాలు లేదా మిరియాల రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
No comments