Latest

Loading...

ఉలవలుతో బరువు తగ్గడం ఎలా

ఉలవలు

* ఉలవల్లో ఎన్నో పోషకాలున్నాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరికీ బోలెడు ప్రయోజనాల్ని ఇస్తాయి. అవేంటో చూద్దాం రండి..

*ఉ లవల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్‌, పాస్ఫరస్‌లతో పాటు బోలెడంత పీచు పదార్థమూ లభిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు వీటిని రోజూ చారుగా కానీ, స్నాక్స్‌గా కానీ తీసుకోవచ్చు. * ఉలవలు, కొత్త బియ్యం సమానంగా తీసుకుని జావ చేసుకుని తాగితే కాల్షియం లభిస్తుంది. ఎముకలకు, కండరాలకు కూడా శక్తి అందుతుంది. గాయాలు త్వరగా మానడానికి ఉలవలు తోడ్పడతాయి.

*ఉలవల్లోని పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీంతో జర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. ఆకలి పెరుగుతుంది. వీటిని ఎదిగే పిల్లలు తింటే చాలా మంచిది. * ఉలవలతో రుతుక్రమ సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు.

No comments

Powered by Blogger.