విద్యార్థుల భద్రత ప్రభుత్వ బాధ్యత..
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొనే ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. అన్నివిధాలా ఆలోచించే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ షెడ్యూల్ ప్రకారం టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గురువారం విజయవాడలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
పరీక్షల విషయంలో ప్రతిపక్షాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేసేలా వ్యవహరించడం సరికాదని అన్నారు.
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు కాలేదని గుర్తు చేశారు.
ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1,452 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రతి పరీక్ష కేంద్రాన్ని శానిటైజ్ చేసి సిద్ధంగా ఉంచుతామని చెప్పారు. నేటి నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని, హాల్‌టికెట్లపైనా కొవిడ్ నిబంధనలను స్పష్టంగా పేర్కొన్నామని తెలిపారు.
పరీక్షలు నిర్వహించకపోతే భవిష్యత్‌లో విద్యార్థులకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కేవలం పాస్ సర్టిఫికెట్‌తో విద్యార్థులకు ఏం ప్రయోజనమని అన్నారు. పరీక్షల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు
No comments