అమ్మఒడి వివరాలు వెంటనే పూర్తిచేయాలి
వచ్చే విద్యా సంవత్సరంలో అమ్మఒడి పథకం ద్వారా నగదు లేదా ల్యాప్ట్యాప్లను కోరుకునే విద్యార్థుల పెండింగ్ వివరాలను వెంటనే పూర్తిచేయాలని ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి కె.నాగేశ్వరరావు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో 8, 9, 10 తరగతుల నుంచి 2,02,688 మంది విద్యార్థులను లబ్ధిదారులుగా గుర్తించామన్నారు. మిగిలిన వివరాలకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
No comments