Corona health tips : ఈ కోవిడ్ టైమ్ లో తప్పకుండా తాగాల్సిన డ్రింక్స్ ఇవే...
ఇప్పుడు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. కాబట్టి మనం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇంట్లోనిత్యం మనం వాడే పదార్థాలతోనే ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. అలాగే ఎండాకాలం కూడా కాబట్టి ఎలాంటిపానీయాలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.
గొంతు నొప్పి, దగ్గుకి తేనె నిమ్మరసం బాగా పనిచేస్తుంది. ఓ గిన్నెలో 4 కప్పుల నీళ్లు తీసుకొని, దానిలో తురిమిన అల్లం, చిన్న దాల్చిన చెక్క, తరిగిన మూడు వెల్లుల్లి, లవంగాలు, ఒక టీస్పూన్ పుదీనా రసం, నిమ్మరసాన్ని కలిపి కాసేపు వేడిచేయాలి. చల్లబడిన తర్వాత.. దానిలో తేనె కలిపి తాగాలి.
ఇలా వారానికి రెండు స్లారు చేస్తే మంచిది.
పసుపులో కర్కుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపులోని బలమైన వ్యాధి నిరోధక లక్షణాలు మంట, నొప్పి తట్టుకునేలా మన శరీరాన్ని తయారు చేస్తాయి. ముందుగా పసుపు నీటిలో కలిపి 15- నుండి 20 నిమిషాల పాటు వేడిచేయాలి. రుచి కోసం దానిలో నిమ్మకాయ, తేనె కలిపి తీసుకోవాలి.
రోగనిరోధక శక్తిని పెంచే వాటిలో మసాలా టీ ఒకటి. దీని తయారీ కోసం ముందుగా తురిమిన అల్లం, దాల్చినచెక్క, మిరియాలు, లవంగాలు, ఏలకులు, తులసి ఆకులను అర కప్పు నీటిలో వేసి 30 నిమిషాలు ఉడకబెట్టండి. కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా తేనె వేసి తీసుకోండి. మసాలా టీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ టీ తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. తేనెలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఈ వేసవిలో తాగాల్సిన పానీయంలో గ్రీన్ స్మూతీ ఒకటి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఇతర యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఫలితంగా కడుపులో మంట తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగే శక్తినిస్తాయి. ముందుగా కొంచెం బచ్చలికూర, మామిడి లేదా పైనాపిల్, నిమ్మరసం, తాజాగా తరిగిన అల్లం, బాదం పాలు లేదా పెరుగు తీసుకొని మిక్సర్ లో కలపండి. ఆ మిశ్రమాన్ని తాగండి.
రోగనిరోధక శక్తిని పెంచేవాటిలో కధాస్ పానీయం ఒకటి. ఇది జలుబు, దగ్గుతో బాధపడేవారికి మంచి ఫలితాన్నిస్తుంది. అంతేకాక, శ్వాసకోశ వ్యాధులకు కూడా చికిత్స చేస్తుంది. తులసి, లవంగాలు, దాల్చినచెక్క, అల్లం, క్యారమ్ విత్తనాలు, పసుపు, నల్ల మిరియాలను ఒక గిన్నెలో వేసి వేడి చేయండి. రుచి కోసం ఆ మిశ్రమంలో తేనె లేదా బెల్లం కలిపి తీసుకోండి.
పైన చెప్పిన వివరాలన్నీ కూడా మీ వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది.