Coronavirus - be careful next 2 years
రెండో దశ కరోనాను ఎదుర్కోవడంలో భారత్ పూర్తిగా విఫలమైందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్ మేనేజ్మెంట్-అహ్మదాబాద్(ఐఐఎం-ఏ)లో ప్రముఖ ఆచార్యుడు చిన్మయ్ తుంబే తెలిపారు. దీనికి ఆయన రెండు కారణాలను ఎత్తిచూపారు. ఒకటి.. ప్రభుత్వంతో పాటు, ప్రజలు మహమ్మారిని తేలిగ్గా తీసుకున్నారని తెలిపారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో మరికొన్ని నెలల్లో వైరస్ పూర్తిగా నశించిపోతుందని అంతా భావించారన్నారు. ఇక కరోనా రకాలపై పెద్దగా దృష్టి సారించకపోవడం రెండో కారణమని తెలిపారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా తొలినాళ్లలో విస్తరించిన దానితో పోలిస్తే చాలా భిన్నమైందని పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థను త్వరగా తెరవాలనుకోవడం భారత్ చేసిన తప్పిదమని తుంబే అభిప్రాయపడ్డారు. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలను నెమ్మదిగా పునరుద్ధరించారని తెలిపారు. అలాగే కరోనా వ్యాప్తి వెనుక ఉన్న శాస్త్రీయతను కూడా పూర్తిగా విస్మరించారన్నారు. కుంభమేళా నిర్వహణే అందుకు నిదర్శనమన్నారు. మహమ్మారి ప్రమాదం నుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు అనుమతించి ఉండాల్సింది కాదన్నారు. అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో ఆక్సిజన్ సిలిండర్లు, ఆస్పత్రిలో పడకలు, వెంటిలేటర్లతో సిద్ధంగా ఉండాల్సిందన్నారు. డిసెంబరు-ఫిబ్రవరి మధ్య మహమ్మారి వ్యాప్తిపై నిర్లక్ష్యం తారస్థాయికి చేరిందన్నారు.
No comments