Latest

Loading...

Dates benefits : ప్రతిరోజు రెండు ఖార్జురాలు తింటే కలిగే ప్రయోజనాలు


 






రోజూ ఖర్జురాలు తినడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్లు, ఐరన్, ప్రోటీన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెంచడానికి మాత్రమే కాకుండా.. అనేక వ్యాధుల నుంచి ఇవి కాపాడతాయి. వీటిని రోజూ వారీ డైట్ లో తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలను కాపాడటమే కాకుండా.. మరిన్ని ప్రయోజనాలను చేకురుస్తుంది. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. ఎముకలను బలపరుస్తుంది…

ఇందులో భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరచడమే కాకుండా.. కండరాల సమస్యలను తగ్గిస్తుంది.


2. కళ్ళ సమస్యలను..

రోజూ ఖర్జురాలను తినడం వలన కళ్ళకు మంచిది. ఇందులో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది.అందువలన కంటి సమస్యలను తగ్గించడమే కాకుండా.. కళ్ళను పూర్తి ఆరోగ్యంగా ఉంచుతుంది.


3. రోగ నిరోధక శక్తి..

రోజూ ఖర్జురాలను తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో విటిమిన్లు, ఐరన్ ఉండడం వలన చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.


4. ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యకరమైన గుండె కోసం ఖర్జురాలు మంచివి. అలాగే అనేక రకాల అనారోగ్య సమస్యలను శారీరక బలహీనత, రక్తహీనత, గుండె జబ్బులను నయం చేస్తాయ.


5. బరువు తగ్గడానికి సహయపడతాయి. ముఖ్యంగా బొడ్డు చుట్టూ ఉండే కొవ్వున తగ్గిస్తాయి.


6. రోజూ ఖర్జురాలను తినడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి ఇవి సహయపడతాయి. అంతేకాకుండా చర్మ సమస్యలను తగ్గిస్తుతంది.





No comments

Powered by Blogger.