Food : అతిగా తింటే ప్రమాదమే
ఎండల తీవ్రత పెరిగేకొద్దీ మన శరీర వ్యవస్థకు కష్టాలు మొదలవుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతే ఇబ్బందులు తలెత్తవచ్చు. ముఖ్యంగా చికెన్, మటన్, ఇతర నాన్‌వెజ్ వంటకాలను సాధ్యమైనంత వరకూ తగ్గించాలి. మసాలాలూ, వేపుళ్లు ఏ మాత్రం ఆరోగ్యానికి మంచివి కావు. జంక్‌ఫుడ్‌కు గుడ్‌బై చెప్పడమే ఉత్తమం. 'ప్రతి దానికీ సాస్ కుమ్మరించుకోవడం కూడా ప్రమాదకరమే' అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఇవన్నీ మన జీర్ణ వ్యవస్థమీద తీవ్ర ప్రభావం చూపుతాయి. అవి జీర్ణం కావడమూ అంత సులభం కాదు. పండ్లు, కూరగాయలు, మజ్జిగ పుష్కలంగా తీసుకోవాలి. ఎండలో బయటికి వెళ్లేవేళ మంచినీళ్లు తాగాలి. అందులో ఓ నిమ్మకాయ పిండుకుంటే మరింత మంచిది.
స్నానానికి వేడినీళ్లు వాడకపోవడమే శ్రేయస్కరం. పొగలు గక్కే నీళ్లు చర్మకణాలను దెబ్బతీస్తాయి. వీలైనన్నిసార్లు చల్లని నీళ్లతో మొహం కడుక్కోండి.