Latest

Loading...

Ginger Tea Benefits: ఇమ్యూనిటీని పెంచే అల్లం టీ

Ginger tea benefits

 Ginger Tea Benefits: ప్రకృతి ప్రసాదించిన వరాల్లో అల్లం ఒకటి. ప్రతి ఇంట్లో అల్లాన్ని ఏదో రూపంలో వాడుతూ వుంటారు. వంటింట్లో వున్న ఔషదాల్లో ఒక గొప్ప ఔషదం అల్లం. భారతదేశంలో దొరికే మసాలా దినుసుల్లో ఒక్కో పదార్థానికి ఒక్కో ప్రత్యేక గుణం ఉంది.ఇందులో భాగంగానే అల్లం గురించి మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం.

నిరోధక శరోగక్తిని పెంచడంలో జింజర్ టీ బాగా పనిచేస్తుంది. కాబట్టి వర్షాకాలంలో దీన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఆ సమయంలోనే ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఈ టీ తీసుకుంటే ఎలాంటి సమస్యలు దరిచేరవు.

ఇన్ఫెక్షన్లను అడ్డుకుని ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది.

అల్లంలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి అలర్జీ సమస్యలను దూరం చేస్తాయి. ఈ కారణంగా ఆస్తమా కూడా తగ్గుతుంది. జింజరాల్స్, జింజెరాన్‌లు అనే ప్రత్యేక గుణాలు కలిగిన అల్లం రక్తనాళాల్లో పేరుకున్న అడ్డంకులని తొలగిస్తుంది. టైప్ 2 డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకి షుగర్ లెవల్స్ తగ్గించడంలో అల్లంటీ భేషుగ్గా పనిచేస్తుంది. దీన్ని తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి రెగ్యులర్‌గా తీసుకోవడం చాలా మంచిది..

అల్లం టీ తో పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లంలో ఉండే ఔషద గుణాలు పొట్టలో వున్న గ్యాస్‌ని బయటికి పంపించేయడానికి ఉపయోగపడతాయి. ఫలితంగా పొట్ట ఉబ్బరం, నొప్పి నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది.

శీతాకాలంలో జలుబు బారిన పడకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు అల్లం బాగా ఉపయోగపడుతుంది. చిన్న ముక్కలుగా తరిమిన ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలని రెండు కప్పుల నీటిలో వేసి 10 నిమిషాలపాటు మరగపెట్టాలి. అల్లంతో కాచిన ఈ నీళ్లు వేడి తగ్గిన తర్వాత కొన్ని తేనే చుక్కలు అందులో కలుపుకుని సేవించాలి. అప్పుడప్పుడు ఇలా అల్లంతో కాచిన నీటిని రోజులో రెండు లేదా మూడుసార్లు సేవిస్తే, జలుబు దరిచేరదు.

వివిధ రకాల నొప్పులకి అల్లం ఒక దివ్యమైన ఔషదంగా పనిచేస్తుంది. వేడి నీటిలో అల్లం, నిమ్మరసం, తేనే మిశ్రమాలు కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది. చాలామందికి ఉదయం లేవగానే వికారం, వాంతి వంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యనే పైత్యం అని కూడా అంటారు. అలా బాధపడేవారు రోజూ అల్లం టీని తాగితే సమస్య తగ్గుతుంది. దీన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.

మరీ ముఖ్యంగా ఈ టీ గుండె సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే... అల్లం రక్తాన్ని పలుచగా చేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని కూడా చాలా వరకూ తగ్గుతుంది. ఇక ఆడవారిలో వచ్చే నెలసరి సమస్యలకు అల్లం చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. పీరియడ్స్‌ ఓ 4 రోజుల ముందు నుంచే అల్లం టీ తాగడం వల్ల ఆ సమయంలో వచ్చే నొప్పులు చాలావరకూ దూరమవుతాయి. అంతేనా.. రక్తసరఫరా కూడా కూడా మెరుగవుతుంది.


No comments

Powered by Blogger.