Latest

Loading...

God : ఏకాదశి రోజున ఇలా చేయడం వలన మీ పాపాలన్నీ తొలగిపోతాయి...


 

ఏకాదశి అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. ఆ శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం విశిష్టంగా ఏకాదశి నాడు పూజ చేస్తారు. అందులోనూ తొలి ఏకాదశి అయితే ప్రత్యేకించి పూజలు, వ్రతాలు ఇలా ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే . ఇలా ఓ ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి. మొదటిది శుక్లపక్షము రెండవది కృష్ణ పక్షము . ఇలా పక్షానికొక ఏకాదశి వస్తుందన్నమాట. అయితే హిందువులు ముఖ్యంగా 2 ఏకాదశులను ప్రత్యేకించి జరుపుకుంటారు.. ఇప్పుడు వాటిని తెలుసుకుందాం.


తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఎంతో మంది భక్తులు ఏకాదశి నాడు వ్రతం చేస్తుంటారు. వాస్తవానికి ఈ ఒక్క వ్రతం చేయడం వలన మనం చేసిన పాపాలు అన్ని తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు.


ఈ వ్రతం ఎలా చేయాలంటే.. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ..శుభ్రమైన వస్త్రాలను ధరించి .. లక్ష్మీనారాయణులను భక్తిశ్రద్ధలతో పూజించాలి. జాగరణ కూడా చేయాలి. ఆవునేతితో దీపాన్ని వెలిగించి పూజను ప్రారంభించాలి. ఆ దీపాన్ని వెలిగించే ప్రమిద కింద ఒక రావి ఆకు పెట్టి అనంతరం దీపాన్ని వెలిగించాలి.


ఇలా చేయడం వల్ల ఆ శ్రీ మహా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రావి ఆకు మొదటి భాగం దేవుడి పటాలు వైపు చివరి భాగం మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం, ఆమె కుటుంబానికి ఉన్న దోషాలు నివారణ, ఆ శ్రీ మహా విష్ణువు యొక్క అనుగ్రహం, సకల సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలా ఏకాదశి వ్రతం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ ఏకాదశి నిన్న ప్రారంభమయి ఈ రోజు రాత్రి 9.47 గంటలకు ముగుస్తుంది. ఈ ఏకాదశి రోజున చేసిన పూజతో తెలిసో తెలియకో చేసిన తప్పులన్నీ పోతాయి.


No comments

Powered by Blogger.