Helth : తాటి ముంజలతో కలిగే ప్రయోజనాలు
వేసవి కాలంలో లభించే తాటి ముంజలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎండాకాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడే ఆహారపదార్థాల్లో తాటి ముంజలు ప్రధానమైనవి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ ముంజల ద్వారా ప్రయోజనాలు తెలుసుకుంటే అస్సలు మిస్ చేసుకోరు. వీటిలో శరీరాన్ని చల్లబరిచే గుణం ఉండటం చేత వేసవి ఎండ నుంచి కాపాడుకోవడంలో తాటి ముంజలు చాలా బాగా పని చేస్తాయి. తాటి ముంజల్లో విటమిన్ ఎ,బి,సి, ఐరన్, జింక్, పాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలుంటాయి. వీటితో శరీరంలో ఉన్న వ్యర్థపదార్థాలు వెలుపలికి తరిమేస్తాయి. వీటిని తరుచూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి అజీర్తి, ఎసిడిటీ సమస్యలు దూరం అవుతాయి.
*తాటి ముంజలతో మరికొన్ని ప్రయోజనాలు:
*శరీరాన్ని డీహైడ్రేషన్ బారినుండి కాపాడుతుంది
*రక్తపోటు అదుపులో ఉంచి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది
*లివర్ ఆర్యోగ్యానికి ఇవి మంచివి
*చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది
*మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిస్తుంది
*వేసవిలో వచ్చే చికెన్ పాక్స్‌ని నివారించి, శరీరాన్నికూల్ గా ఉంచుతుంది
*బరువు తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి
ముంజల గుజ్జును ముఖానికి రాసుకుంటే స్కిల్ గ్లో అవుతుంది
No comments