Latest

Loading...

Lung infection : ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు గుర్తించడం ఎలా...

Lung infection

 కరోనా వైరస్ ప్రధాన టార్గెట్ ఊపిరితిత్తులేనా! ఎందుకంటే కొవిడ్‌-19 సోకిన వారిలో చాలామంది శ్వాస ఆడకనే ఇబ్బంది పడుతున్నారు ! నిజానికి వైరస్ చాలావరకు మన గొంతు ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. శ్వాసమార్గం గుండా నేరుగా వైరస్ లంగ్స్‌కు చేరుతుంది. కాబట్టి ముందుగా వాటిపైనే ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల శ్వాసమార్గంలో ఇన్‌ఫెక్షన్ ఏర్పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. గొంతు నొప్పి, పొడి దగ్గు వస్తోంది. కరోనా సోకిన వారిలో దాదాపు 80 శాతం మందిలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. కొంతమందిలో న్యుమోనియా లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు.

"కరోనావైరస్ లక్షణాలు బయటపడేసరికే 25 శాతం వరకు లంగ్స్ దెబ్బతింటాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపించగానే ఆలస్యం చేయకుండా జాగ్రత్త పడటం ద్వారా కరోనా నుంచి తొందరగా బయటపడొచ్చు."


ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందంటే.. మీ ఊపిరితిత్తుల్లోకి వైరస్ ప్రవేశించిందని అనుమానించాల్సిందే. ఊపిరితిత్తుల దిగువ భాగంలో వాపు లేదా నొప్పి ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పొడి దగ్గు, దగ్గుతున్నప్పుడు నొప్పి రావడం కూడా కొవిడ్‌-19 పాజిటివ్‌గా ఉండటానికి సంకేతాలు అని గుర్తించాలి.

ఇతర సమస్యలు ఏముంటాయి

కొవిడ్‌-10 కారణంగా న్యుమోనియా రావడంతో పాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లంగ్స్ మొత్తం పాడైపోయి ప్రాణానికే ప్రమాదం ఏర్పడవచ్చు. ఈ వైరస్ కారణంగా న్యుమోనియా వస్తే ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు మొత్తం ద్రవంతో నిండిపోయి ఊపిరితిత్తుల వాపు వస్తుంది. దీనివల్ల తీవ్రత దగ్గు రావడంతో పాటు శ్వాస తీసుకోవడం కష్టమైపోతుంది.

ఊపిరితిత్తుల పనితీరును ఎలా మెరుగుపరచాలి..?

ఊపిరితిత్తుల ఆరోగ్యం ప్రధానంగా వాటి సామర్థ్యం, పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఊపిరితిత్తుల పనితీరు బాగుంటేనే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది. కాబట్టి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడాలంటే వ్యాయామం చేయడం చాలా అవసరం. శారీరక శ్రమ వల్ల శ్వాస తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు పెరుగుతాయి. ఫలితంగా ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు రన్నింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయడం మంచిది. పెద్దలు అయితే కనీసం 30 నిమిషాలు, పిల్లలు అయితే గంట పాటు వ్యాయామం చేయడం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

లంగ్స్‌లో దీర్ఘకాలిక మంట తగ్గాలంటే సరైన పోషకాహారం తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. అరటి పండ్లు, యాపిల్‌, ద్రాక్ష, టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.


No comments

Powered by Blogger.