Latest

Loading...

RTC : ఆర్‌టిసిలో మరణ మృదంగం

 


20 రోజుల్లో 9 మంది కరోనాకు బలి

మరో 60 మందికి పాజిటివ్‌

కరోనా సెకండ్‌ వేవ్‌ ఎపిఎస్‌ ఆర్‌టిసిలోని ఉద్యోగ, కార్మికులను కబళిస్తోంది. గత 20 రోజుల వ్యవధిలోనే కృష్ణాజిల్లాలో 9 మంది ఆర్‌టిసి సిబ్బంది మృతి చెందారు. 60 మందికిపైగా కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. విజయవాడలోని ఆర్‌టిసి ప్రధాన కార్యాలయంలోని పలువురు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల (ఇడి) స్థాయి అధికారుల దగ్గర నుంచి వివిధ సెక్షన్లలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న మరో 60 మందికి కరోనా సోకడంతో ఆర్టీసి అధికారులు, ఉద్యోగులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు.


ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలు చూపి జిల్లాలోని 14 డిపోల పరిధిలో సుమారు 100 మంది సిబ్బంది వరకు సెలవులు కోరినట్లు తెలిసింది. అందుకు యాజమాన్యం కూడా అనుమతించినట్లు తెలిసింది. గత 20 రోజుల్లో విజయవాడ డిపోతోపాటు గవర్నర్‌పేట-1, అండ్‌ 2 డిపోలు, ఆటోనగర్‌, ఇబ్రహీంపట్నం తదితర డిపోలకు చెందిన 9 మంది కండెక్టర్లు, డ్రైవర్లు కరోనా కాటుకు బలైనట్లు తెలిసింది. విజయవాడ, గవర్నర్‌పేట 1, 2, ఆటోనగర్‌, ఇబ్రహీంపట్నం, గన్నవరం తదితర 14 డిపోల పరిధిలో సుమారు 60 మందికిపైగా కండెక్టర్లు, డ్రైవర్లు కరోనా బారిన పడినట్లు తెలిసింది. వీరు ఆర్‌టిసికి చెందిన వైద్యశాలతోపాటు వివిధ ప్రయివేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. విజృంభిస్తున్న కరోనా కారణంగా సహజంగానే ప్రయాణికుల రాకపోకలు తగ్గిపోవడంతో పాటు సంస్థలోని ఉద్యోగులు కరోనా బారిన పడటంతో సర్వీసుల సంఖ్యను కూడా పలు రూట్లలో కుదించాల్సి వచ్చింది. ఈపరిణామాలు ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.





No comments

Powered by Blogger.