Teacher Jobs: మొత్తం 3479 టీచర్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 3479 టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 30 చివరి తేదీ. తెలంగాణ, అంధ్రప్రదేశ్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 262 పోస్టుల్ని, ఆంధ్రప్రదేశ్‌లో 117 పోస్టుల్ని భర్తీ చేస్తోంది కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://tribal.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ https://recruitment.nta.nic.in/WebinfoEMRSRecruitment/ లో అప్లై చేయాలి. మరి ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
EMRS Recruitment 2021: దరఖాస్తు విధానం ఇదే...
నోటిఫికేషన్ చదివిన తర్వాత అన్ని విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు https://recruitment.nta.nic.in/WebinfoEMRSRecruitment/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత హోమ్ పేజీలో APPLY FOR EMRS TEACHING STAFF SELECTION EXAM 2021 లింక్ పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో New Registration పైన క్లిక్ చేయాలి.
ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదివిన తర్వాత చెక్ బాక్స్ టిక్ చేసి Click here to Proceed పైన క్లిక్ చేయాలి.
మొత్తం 4 స్టెప్స్‌లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.
మొదటి స్టెప్‌లో పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలన్నీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి.
తర్వాతి స్టెప్‌లో విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.
మూడో స్టెప్‌లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఇటీవలి ఫోటోగ్రాఫ్, అభ్యర్థి సంతకం, డొమిసైల్ సర్టిఫికెట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికెట్, కేటగిరీ సర్టిఫికెట్, వికలాంగుల సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలి.
ఆ తర్వాత ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు ఫామ్‌ను 2021 ఏప్రిల్ 30 లోగా పూర్తి చేయాలి. ఫీజు 2021 మే 1 రాత్రి 11.50 గంటల్లోగా చెల్లించాలి.
ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టుకు రూ.2,000, పీజీటీ, టీజీటీ పోస్టుకు రూ.1,500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
2021 మే 4 నుంచి 6 వరకు దరఖాస్తు ఫామ్‌లో తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు.
అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం 288 స్కూల్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరో 452 స్కూళ్లను ప్రారంభిస్తోంది. దీంతో మొత్తం స్కూళ్ల సంఖ్య 740 కి చేరుకోనుంది. ఇప్పటికే రాష్ట్రాల నుంచి 100 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయి. త్వరలో స్కూళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది.
No comments