తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ.. 8గంటలకు అన్నీ మూసెయ్యాల్సిందే..
Curfew in Telangana: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం, సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో ప్రభుత్వం పరిస్థితి సమీక్షించి కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.
ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తుండగా.. పాక్షిక లాక్ డౌన్ కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
అంతర్రాష్ట్ర రవాణాకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఆసుపత్రులు, మెడికల్ షాపులు, అత్యవసరసేవలు మాత్రం పనిచేస్తాయి. ఏప్రిల్ 30వ తేదీ వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.. ఈరోజు అర్థరాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. దుకాణాలు, రెస్టారెంట్లు రాత్రి 8గంటల వరకు మూసెయ్యాలి. ఎక్కడైనా షాపు ఓపెన్ చేసినట్లు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
No comments