Telugu Teacher : తెలుగు ఉపాధ్యాయుడు మృతి
పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న మహేశ్వరయ్య (40) మంగళవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మహేశ్వరయ్య రెండు రోజుల నుంచి జ్వరం రావడంతో సోమవారం కర్నూలు ఎంఎస్ ఆర్ అస్పత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేయగా నిమోనియా ఉందన్నారు. కరోనా పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఆయాసం అధికం కావడంతో శ్వాస తీసుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
No comments