Lockdown in Telangana తెలంగాణలో 10 రోజులు లాక్డౌన్
లాక్డౌన్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని కేబినెట్ నిర్ణయించింది. లాక్డౌన్ సమయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అవకాశమిచ్చారు. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు.
ప్రతి రోజూ ఉదయం 10 గంటల తర్వాత నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలు కానుంది. ఈ సమయంలో దాదాపు అన్ని కార్యకలాపాలకు నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు. మరోవైపు టీకా కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను పిలవాలని మంత్రివర్గం నిర్ణయించింది.
No comments