10th పాసైన వాళ్లకు శుభవార్త.. రక్షణ శాఖలో ఉద్యోగాలు..?
కేంద్ర రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ (డీఎస్ఎస్సీ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 83 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం డీఎస్ఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్టెనో, ఎల్డీసీ, సివిల్ మోటార్, ఎంటీసీ, ఇతర పోస్టులు ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మే 22వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.
రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారు తమిళనాడు రాష్ట్రంలో పని చేయాల్సి ఉంటుంది. http://dssc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 83 పోస్టులలో మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలు 60 ఉండగా లోయర్ డివిజన్ క్లర్క్ 10, సివిలియన్ మోటార్ డ్రైవర్ 7, స్టెనోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలు 4, సుఖాని ఉద్యోగ ఖాళీలు 1, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి.
No comments