Latest

Loading...

Afternoon sleepమధ్యాహ్నం నిద్రపోతే ఇన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి..

Afternoon sleep

 చాలా మందికి ఆహారం తిన్న తర్వాత మధ్యాహ్నం సమయంలో నిద్ర ఎక్కువగా వస్తుంది అనే సంగతి తెలిసిందే. ఆఫీసుల్లో ఉండే వాళ్ళు అయితే కాసేపు నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్ళు కూడా ఉదయం అంతా పని చేసి మధ్యాహ్నం అన్నం తిని కాసేపు నిద్రపోవడం మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూనే ఉంటాం. చాలా మందికి ఇది ఒక సమస్య కూడా.


మధ్యాహ్నం నిద్ర అలవాటు అయితే మాత్రం అది చాలా కష్టంగా ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు. అది ఒక పిచ్చిగా కూడా మారుతుంది. అయితే అది మంచిది అని కూడా చెప్తున్నారు. నిద్రలేమి సమస్యలు ఉన్న వారికి సహా చాలా మందికి మేలు చేస్తుంది అని చెప్తున్నారు.

లంచ్ తర్వాత కాసేపు నిద్రపోతే ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది అనేది నిపుణులు చెప్పే మాట.


బీపీ ఉన్న వారికి ఇది చాలా ఉపయోగంగా కూడా చెప్తూ ఉంటారు. అలాగే శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది అని కూడా చెప్తున్నారు. షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడే వారికి మధ్యాహ్నం నిద్ర అనేది చాలా మంచిదిగా చెప్తున్నారు. జీర్ణ సమస్యలతో బాధ పడే వారికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది అని అంటున్నారు. ఇక కొవ్వు కూడా కరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. నిద్రలేమి సమస్యలు ఉన్న వారు కూడా దీని నుంచి బయటపడవచ్చు. అనారోగ్యంతో ఉన్న వారు కూడా కోలుకోవడానికి సహకరిస్తుంది.

No comments

Powered by Blogger.