టిటిడి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి నడక మార్గంను రెండు నెలలపాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 1 నుండి జూలై 31వ తేదీ వరకు అలిపిరి కాలినడక మార్గం మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునః నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు జూన్ 1 నుండి జూలై 31వ తేదీ వరకు ఆ మార్గాన్ని మూసివేస్తున్నట్టు టిటిడి తెలిపింది.అయితే కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని కోరింది. వెళ్లాలని సూచించింది
No comments