Almonds : బాదం బహు మేలు
ఒకప్పుడు నచ్చినవీ, అందుబాటులో ఉన్నవీ మాత్రమే తినేవారు. ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పోషకాలు ఉన్నాయని తెలిస్తే చాలు, ఎగబడి తినేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా, బాదం గింజలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు.
బాదం పప్పులో 'విటమిన్-ఇ' పుష్కలం. అది శరీరంలోని ఫ్రీరాడికల్స్ డ్యామేజీని తగ్గిస్తుంది. అలాగే జుట్టు, చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
ఫైబర్ మోతాదు ఎక్కువ. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం, కడుపుబ్బరం దూరమవుతాయి.
బాదం గింజల్లో క్యాల్షియం, మెగ్నీషియం అధికం. గుండె, ఎముకల సమస్యలను దూరం చేస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
వీటిలోని పొటాషియం బ్లడ్ ప్రెషర్ సాధారణంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
ఇందులోని మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
No comments