Andhra pradeshసర్కార్ సరికొత్త నిర్ణయం.. ఏకంగా విద్యాసంస్థలనే ..!
దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాలలో కూడా కోవిడ్ తీవ్రత అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలను అమలు పరుస్తుంది. ఇప్పటికే మినీ లాక్ డౌన్ అమలు పరుస్తున్న ప్రభుత్వం..తాజాగా మరో కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు విద్యాసంస్థలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చబోతున్నట్లు ప్రకటించింది. జిల్లాల వారీగా ఉన్న విద్యాసంస్థలలో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య, తదితర సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
No comments