Andhrapradesh: జూన్ నెలలో ఏపీలో అమలు కానున్న పథకాలు ఇవే.. ప్రకటించిన సీఎం జగన్
వచ్చే నెలలో (జూన్) రాష్ట్రంలో అమలు కానున్న పథకాలను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. వచ్చే నెల 8న జగనన్న తోడు, 15న వైఎస్ వాహనమిత్ర, 22న వైఎస్ఆర్ చేయూత పథకాలను అమలు చేస్తామని తెలిపారు. సోషల్ ఆడిట్ తర్వాత గ్రామాల్లోని జాబితాలో మార్పులు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. ఈ నెల 31న పశ్చిమగోదావరి జిల్లాలో అమూల్-ఏపీ పాల ప్రాజెక్టు ప్రారంభమవుతుందన్న జగన్… రాయితీ వేరుశెనగ విత్తనాల పంపిణీ జూన్ 17 నాటికి పూర్తవ్వాలని ఆధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జులై 8న రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉగాది నాటికి మధ్యతరగతి వారికి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని.
పట్టణాలు, నగరాల్లో 17 వేల ఎకరాలు అవసరమవుతున్నట్లు అంచనా వేశామన్నారు. వివిధ కేటగిరీల్లో ప్రభుత్వం, ప్రైవేట్ భూములను సేకరించినట్లు సీఎం జగన్ తెలిపారు. కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీలకు ఈనెల 30న శంకుస్థాపన చేస్తామని చెప్పారు.
కరోనాపై సీఎం జగన్ సమీక్ష
కరోనాపై పోరాటంలో భాగమైన సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. కొద్దిరోజులుగా కేసులు తగ్గుతున్నాయని.. సానుకూల పరిస్థితి ఏర్పడుతోందని సీఎం చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉభయగోదావరి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు కరోనా కట్టడిపై మరింత ఫోకస్ పెంచాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలు కచ్చితంగా అమలు కావాలన్నారు. రూల్స్ ఉల్లంఘించిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. తరచుగా తప్పులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Bro colony house 🏠
ReplyDeleteDetails unte sepande