Apలో 266 టీచింగ్ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?
కరోనా వల్ల దేశంలోని లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోతున్నారు. కొత్త జాబ్ నోటిఫికేషన్ల కొరకు ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 149 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మే నెల 23వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.
https://angrau.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 149 ఉద్యోగ ఖాళీలలో ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు 6 ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు 34, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు 109 ఉన్నాయి. అగ్రికల్చర్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్ విభాగాలలో ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో యూనివర్శిటీ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు ఉండాలి.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ సైతం 117 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మే 22 దరఖాస్తులకు చివరితేదీగా ఉంది. https://svvu.edu.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ ఖాళీలు 47 ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్ల ఉద్యోగ ఖాళీలు 70 ఉన్నాయి.
ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా వెటర్నరీ సైన్స్, డెయిరీ సైన్స్, ఫిషరీ సైన్స్, అగ్రికల్చరల్ సైన్సెస్ విభాగాల్లో ఉద్యోగ ఖాళీలున్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎవీఎస్సీ, వీఈపీఎం, ఎంబీఏ, ఎంఎఫ్ఎస్సీ, పీహెచ్డీ డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
No comments