Latest

Loading...

APలో కర్ఫ్యూ పొడిగింపు?.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే....

AP CURFEW

 ఏపీలో ఈ నెలాఖరుతో కర్ఫ్యూ ముగుస్తోంది. ఈ క్రమంలో కర్ప్యూను మరో రెండు వారాల పాటు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎల్లుండి కరోనాపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కర్ప్యూ పొడిగింపుపై నిర్ణయం ప్రకటించనున్నారు. కొన్ని సడలింపులు ఇవ్వాలాఝ? లేదా యథాతధంగా ఇప్పటిలాగే కర్ఫ్యూ కొనసాగించాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.


దీనికి సంబంధించి సూచనలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే అధికారులను జగన్ ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు తగ్గగా.. కొన్ని జిల్లాల్లో మాత్రమే నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో కొన్ని సడలింపులు ఇచ్చే అవకాశముంది.

అటు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న చిత్తూరు జిల్లాలో జూన్ 15వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశమిస్తామన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రాకపోకలను కట్టడి చేయడానికే కర్ఫ్యూ పొడిగించామన్నారు.


No comments

Powered by Blogger.