Australia:ఎవరైనా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెడితే ఐదేళ్ల జైలు శిక్షనట.. ఎందుకంటే.. ?
ఇండియాలో వీరంగం సృష్టిస్తున్న కరోనా వల్ల ప్రపంచ దేశాలు ఒకవైపు జాలి చూపిస్తుండగా, మరో వైపు తమ భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి.ఒకప్పుడు కరోనా వచ్చిన మొదట్లో మన దేశం ఇతర దేశాలను చూసి ఎలా భయపడిందో అదే పరిస్దితి ఇప్పుడు ఇండియాను చూస్తున్న ఇతర దేశాల్లో నెలకొంది.
ఇప్పటికే పలు దేశాలు ఇండియా నుండి వచ్చే ప్రయాణికులను నిషేధించగా తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా దేశ చరిత్రలోనే తొలి సారిగా ఎవరు తీసుకోనటువంటి కీలక నిర్ణయం తీసుకుంది.ఈ కఠిన నిబంధలో భాగంగా భారత్‌లో 14 రోజుల పాటు ఉన్న తమ దేశ పౌరులు ఎవరైనా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెడితే ఐదేళ్ల జైలు శిక్ష లేదంటే 66 వేల డాలర్ల (రూ.49 లక్షలు) జరిమానా విధిస్తామని హెచ్చరించింది.కాగా నేటి నుంచే ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చిందట.
అయితే ఈ సరికొత్త నిబంధనల నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, శిక్షణ సిబ్బందికి బయో సెక్యూరిటీ చట్టం కింద మినహాయింపు ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
No comments