Latest

Loading...

ఐసోలేషన్ వారికీ కేంద్రం సూచించిన గైడ్‌లైన్స్‌

Isolation

 దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఏమాత్రం కరోనా లక్షణాలు అనిపించినా ఐసోలేషన్ లో ఉంటున్నారు. హాస్పటల్ లలో కంటే ఇంట్లో ఐసోలేషన్ లో ఉండే వారే ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారికీ కేంద్రం గైడ్‌లైన్స్‌ ఇచ్చింది.

అవి ఏంటి అనేవి చూస్తే..

* 60 సంవత్సరాలు పైబడిన లేదా బీపీ, షుగర్, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో బాధపడే పేషెంట్లను మెడికల్‌ అధికారి పరిశీలించాకే హోం ఐసోలేషన్‌కు అనుమతిస్తారు.

* హోం ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్ల ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గినా, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు తలెత్తినా డాక్టర్‌ను సంప్రదించి వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి.

* గృహ స్వీయ నిర్భంధంలో ఉన్న పేషెంట్లు రోజుకు రెండుసార్లు ఉప్పునీళ్లతో పుక్కిలించడం, రెండుమార్లు ఆవిరి పట్టడం చేయాలి.

* రోజుకు నాలుగుమార్లు 650 ఎంజీ పారాసిటమాల్‌ మాత్రలు ఇచ్చినా జ్వరం తగ్గకుంటే వైద్యుడిని సంప్రదించి నాన్‌ స్టిరాయిడల్‌ యాంటి ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్‌ని వాడవచ్చు.

* ఐవర్‌మెక్టిన్‌ మాత్రను పరిగడుపున 3-5 రోజుల పాటు వాడే విషయాన్ని పరిగణించవచ్చు.

* ఆక్సిజన్‌ స్థాయిలు 94 శాతం పైన ఉండి, ఎలాంటి లక్షణాలు చూపకపోయినా, టెస్టుల్లో పాజిటివ్‌ వచ్చినవారిని ఎసింప్టమాటిక్‌ అని, స్వల్ప లక్షణాలు చూపుతూ, ఆక్సిజన్‌ స్థాయిలు 94 శాతంపైచిలుకు ఉన్నవారిని స్వల్పలక్షణాలున్నవారని గుర్తిస్తారు.

* వ్యాధిగ్రస్తుడి కేర్‌టేకర్లు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ప్రొఫైలాక్సిస్‌ను డాక్టర్‌ సలహా తీసుకోవాలి. ఎన్‌-95 మాస్క్‌ను ధరించాలి

* ఐసోలేషన్‌ గదిలోకి గాలి వెలుతురు బాగా వచ్చేలా ఏర్పాటు చేసుకొని, ట్రిపుల్‌ లేయర్‌ మెడికల్‌ మాస్కును ధరిస్తూ ఉండాలి. 8 గంటల తర్వాత మాస్కు మారుస్తుండాలి.

 

*రోగనిరోధకత తక్కువగా ఉన్న పేషెంట్లకు హోం ఐసోలేషన్‌ పనికిరాదు.


* సుమారు పదిరోజులు పైబడి ఐసోలేషన్‌లో ఉన్నవారు లక్షణాలు తగ్గగానే(మూడురోజుల పాటు జ్వరం రాకుండా ఉండడం లాంటివి) డిశ్చార్జ్‌ కావచ్చు. హోం ఐసోలేషన్‌ పూర్తి చేసుకొని, లక్షణాలు కనిపించని వారు తిరిగి కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సిన అవసరం లేదు.


No comments

Powered by Blogger.