ప్రైవేట్ హాస్పిటల్స్ కు వైద్యఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు
కొవిడ్ రోగులను చికిత్స నిమిత్తం హాస్పిటల్స్ లో చేర్చుకునే విషయంపై ప్రైవేట్ దవాఖానలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్న వారిని మాత్రమే చేర్చుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు సూచించారు.
ఆక్సిజన్ 94 శాతం కంటే ఎక్కవుంటే హోంఐసోలేషన్లో ఉంచాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో పడకల సంఖ్య వివరాలను ఎప్పటికప్పుడు బయట ఉంచాలని కోరారు.
కొవిడ్ చికిత్సకు అనుమతులు లేని హాస్పిటల్స్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
హాస్పిటల్స్ నిర్వాహకులు రోగులను ఇబ్బందికి గురిచేయకుండా మానవత్వంతో వ్యవహరించి చికిత్స అందించాలని సూచించారు.
No comments