Latest

Loading...

భోజనం చేసిన వెంటనే... ఈ పనులు అస్సలు చేయకూడదు


 After Food : ప్రస్తుతం అందరిదీ బిజీ లైఫ్. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే మనిషి రోబోలా తయారయ్యాడు. మరీ ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో. ఈ క్రమంలో అలవాట్లలో అనేక మార్పులు వచ్చాయి. అవి.. అనారోగ్యానికి దారి తీస్తున్నాయి. మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. చాలామంది భోజనం చేసిన వెంటనే కొన్ని చెయ్యకూడని పనులు చేస్తున్నారు. అలాంటి పనులతో ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు.


ఈ క్రమంలో భోజనం చేశాక కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అధ్యయనాల్లో తేలింది. అందుకే ఏమేం చేయకూడదో తెలుసుకుందాం..

చాలామంది భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తారు. ఇలా చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదు. దీంతో పాటు గ్యాస్‌, కడుపులో మంట వంటివి వస్తాయి. అంతగా స్నానం చేయాలనుకుంటే భోజనమయ్యాక ఓ గంట ఆగి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

* అన్నం తిన్నాక ఏవైనా పండ్లు తినడం మీకు అలవాటా? ఇదీ తప్పే అంటున్నారు. ఎందుకంటే తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోపు పండ్లను తినడం వల్ల ఆ పోషకాల్ని కోల్పోతాం. కాబట్టి పండ్లను తినాలనిపిస్తే భోజనం తర్వాత గంటకి తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

* ఇక భోజనం చేసిన వెంటనే నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంటుంది. అది కూడా తప్పేనట. ఇలా చేస్తే బరువు పెరుగుతారు.

* ఇక తిన్న వెంటనే వ్యాయామం కూడా చేయకూడదు. టీ, కాఫీలు తాగకూడదు. అలా అని తిన్న వెంటనే కూర్చోకండి. మెల్లిగా కాసేపు అటూ ఇటూ నడిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


No comments

Powered by Blogger.