కొండ అంచున ఊరు
కొండ అంచు ఊరు
ఎత్తైన కొండ అంచున కాసేపు నిలబడాలంటేనే 'కళ్లు తిరిగి ఎక్కడ పడిపోతామో' అని భయపడిపోతాం. విచిత్రం ఏంటంటే... స్పెయిన్‌లోని 'కాసిల్‌ఫొల్లిట్ డి లా రొకా' గ్రామంలోని ఇళ్లన్నీ యాభై మీటర్ల ఎత్తున్న సన్నటి రాతి కొండ అంచులో ఉంటాయి. కిలోమీటరు పొడవున్న దీనిమీద వరుసగా దారికి అటూ ఇటూ ఒక్కో ఇల్లు కట్టే వీలు మాత్రమే ఉంది. ఇంటి గోడలు కూడా పూర్తిగా కొండ అంచుకి ఉంటాయి. రెండు నదుల మధ్యలో బసాల్ట్ కొండ మీదున్న ఈ గ్రామం ఎన్నో వందల ఏళ్ల కిందట ఏర్పడిందట. అందుకే, ఇళ్లు కూడా స్థానికంగా దొరికే రాళ్లతో పురాతన శైలిలో కనిపిస్తాయి.
అంత ఎత్తులో ఉండడంతో పాటు, ప్రకృతి రమణీయతకు అద్దం పట్టినట్లుండడంతో ఈ గ్రామాన్ని సందర్శించేందుకు పర్యటకులు బాగా వస్తుంటారట.
No comments