ఇళ్ల నిర్మాణాలు ఆగకూడదు: CMజగన్
జగనన్న కాలనీల్లో జూన్ 1వ తేదీ నుంచి పనులు ప్రారంభించాలని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీల్లో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణంపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ నిర్మాణ పనులు ఆగకూడదని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగేలా చర్యులు తీసుకోవాలని ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం ఉండకూడదని.. కొవిడ్ వేళ ఇళ్ల నిర్మాణం మెరుగైన ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందన్నారు. అంతేకాకుండా కరోనా వేళ నిర్మాణాలు చేపట్టడంతో కార్మికులకు పని దొరుకుతుందన్నారు.
స్టీల్, సిమెంట్, ఇతర మెటీరియల్ కొనుగోలుతో వ్యాపార లావాదేవీలు సైతం కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్ వ్యవస్థే ఉంటుందని.. నీటి పైపులు, విద్యుత్, ఇంటర్నెట్ కేబుళ్లన్నీ భూగర్భంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు అన్ని రకాల పనులకు డీపీఆర్ సిద్ధం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా నిర్మాణ పనులను ఒకే ఏజెన్సీకి ఇవ్వాలన్నారు.
No comments