కాల్ చేస్తే ఇంటికే ఉచితంగా మాస్క్‌లు, ఆహారం
కరోనాతో ఇబ్బందులు పడుతూ ఇంటి వద్దనే హోంక్వారంటైన్లో ఉన్న రోగులకు ఉచితంగా మాస్క్‌లు, భోజనం పంపిణీ చేస్తున్నట్లు హ్యుమనిటీ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండ శ్రీనివాస్‌రావు తెలిపారు. కరోనా బారిన పడిన వారికి తాము అండగా ఉన్నామనే ధైర్యం అందించడానికి మానవతా ధృక్పథంతో ఎన్ 95 మాస్క్‌లు, భోజనాన్ని ఇంటి వద్దకు తీసుకెళ్లి అందిస్తున్నట్లు తెలిపారు. పేద, అనాథ వృద్ధులకు కూడా ఉచితంగా భోజనం అందిస్తున్నామని, కరోనా బారిన పడిన వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 9949238492 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని డాక్టర్ కొండ శ్రీనివాస్‌రావు కోరారు.
No comments