Latest

Loading...

ఈ సప్లిమెంట్స్ తో గుండెకు ముప్పు ...!

Omega3

 కొవ్వు కరిగించేందుకు, గుండెకు మేలు చేసేందుకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపకరిస్తాయని చెబుతుండటంతో చాలా మంది ఈ సప్లిమెంట్లను వాడుతుంటారు. అయితే వీటితో పలువురిలో గుండె లయ తప్పే ముప్పు అధికమని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లకు గుండె లయ తప్పే వ్యాధులతో సంబంధం ఉందని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీకి చెందిన కార్డియోవాస్కులర్ ఫార్మాకోథెరఫి జర్నల్ లో ప్రచురితమైన అథ్యయనం వెల్లడించింది.

రక్తంలో కొవ్వు శాతం అధికంగా ఉండేవారిలో ఒమెగా-3 సప్లిమెంట్లు గుండె ధమనులపై ప్రభావం చూపుతున్నట్టు ఈ అథ్యయనంలో గుర్తించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ సప్లిమెంట్లను వాడటం మంచిది కాదని పరిశోధకులు హెచ్చరించారు.

50,000 మందికి పైగా వ్యక్తులపై ఏండ్ల తరబడి నిర్వహించిన అథ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గుండె జబ్బుల ముప్పు అధికంగా ఉన్న వారిలో ఒమెగా 3 సప్లిమెంట్ల వాడకంతో స్ట్రోక్ కు దారితీసే కారకాలు పెరుగుతున్నట్టు గుర్తించారు.

No comments

Powered by Blogger.