Corona : దేశంలో మరో సారి 4 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. 4 లక్షలకుపైగా రోజువారీ కేసులు, 4 వేలకు చేరువగా మరణాలు నమోదవడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,14,188 కొత్త కేసులు నమోదయ్యాయి. 4 లక్షలకుపైగా కేసులు చోటుచేసుకోవడం దేశంలో ఇది మూడోసారి. ఇక మరణాలు వరుసగా పదో రోజు 3 వేలకుపైగా నమోదయ్యాయి. తాజాగా కొవిడ్‌తో పోరాడుతూ 3,915 మంది మరణించారు.
* తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,14,91,598కి చేరింది.
* గడిచిన 24 గంటల్లో 3,915 మంది కొవిడ్‌తో మృతి చెందగా.. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 2,34,083కి పెరిగింది.
కేసులతో పోల్చితే రికవరీలు కూడా భారీగానే ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం. గడిచిన 24 గంటల్లో 3,31,507 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 1,76,12,351గా ఉంది.
* ప్రస్తుతం దేశంలో 36,45,164 క్రియాశీల కేసులు ఉన్నాయి.
* దేశంలో నిన్న 18,26,490 పరీక్షలు నిర్వహించారు.
* ఇప్పటి వరకూ దేశంలో 16,49,73,058 టీకాలు పంపిణీ చేశారు.
No comments