Latest

Loading...

Corona Medication: కరోనా లక్షణాలున్నాయా? వెంటనే ఈ మందులు వేసుకోండి..

Corona Medication

 మన దేశంలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చుతోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారినపడుతున్నారు. వేల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. ఐతే చాలా మంది వ్యాధి తక్కువ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు లైట్ తీసుకుంటున్నారని.. బాగా ముదిరిన తర్వాత ఆస్పత్రులకు పరుగులు పెడుతురని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎక్కువ మంది చనిపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలు ఉంటే.. ముందు ట్రీట్‌మెంట్ తీసుకోవాలని సూచించింది. టెస్ట్‌ల గురించి వేచిచూసి, విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని తెలిపింది. ఈ మేరకు కొన్ని మందులను వెల్లడించింది. ప్రభుత్వం సూచించినట్లుగా వాటిని వేసుకుంటే స్వల్ప, మధ్యస్థ స్థాయిలో ఉన్నప్పుడు కరోనాను ఎదుర్కోవచ్చని స్పష్టం చేసింది.


కరోనాను ఎదుర్కొనే మందులు:


1. డాక్సిసైక్లిన్ (Doxycycline): ఈ యాంటీ బయోటిక్/యాంటీ వైరల్ మందును ఉదయం, రాత్రి 5 రోజుల పాటు వేసుకోవాలి.


2. పారాసిటమాల్ (Paracetamol): జ్వరం ఉంటే పారాసిటమాల్ టాబ్లెట్స్‌ను ఉదయం, రాత్రి 10 రోజుల పాటు తీసుకోండి.


3. లెవోసిట్రజిన్ (Levocetirizine): జలుబు లక్షణాలు ఉంటే లెవో సిట్రజిన్ మందులను ఉదయం వేళలో 10 రోజుల పాటు వేసుకోవాలి.


4. రాంటాక్ (Rantack): కడుపు ఉబ్బరంగా ఉండి త్రేన్పులు ఎక్కువగా వస్తే రాంటాక్ టాబ్లెట్స్‌ ప్రతి రోజు ఉదయం 10 రోజుల పాటు తీసుకోవాలి.


5. విటమిన్ సీ (Vitamin c): శరీరంలో రోగనిరోధ శక్తి పెంచుకునేందుకు 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం విటమిన్ సీ టాబ్లెట్లను చప్పరించాలి.


6. మల్టీ విటమిన్ (Multi Vitamin): మల్టీ విటమిన్ టాబ్లెట్స్‌ను కూడా ఉదయం, రాత్రి 10 రోజుల పాటు వేసుకుంటే మంచిది.


7. విటమిన్ డీ (Vitamin d): విటమిన్ డీ టాబ్లెట్స్‌ను ఉదయం పూట ఒకసారి 10 రోజుల పాటు తీసుకోవాలి.


8. మిథైల్ ప్రెడ్నిసోలోన్ (Methylprednisolone): ఒక వేళ ఐదు రోజులైనా జ్వరం తగ్గకపోతే అప్రమత్తమవ్వాలి. మిథైల్ ప్రెడ్నిసోలోన్ డ్రగ్‌ను ఉదయం రాత్రి 5 రోజుల పాటు వేసుకోండి.


స్వల్ప, మధ్యస్థ స్థాయి లక్షణాలున్న వారు కరోనా టెస్ట్‌ల కోసం ఎదరుచూడకుండా ఈ మందులను తీసుకుంటే సరిపోతుంది ( డాక్టర్ల పర్యవేక్షణలో). ఒకవేళ శ్వాస ఆడడంతో ఇబ్బందులు వస్తే మాత్రం కాల్‌సెంటర్‌కు 104కి కాల్ చేయాలి. లేదంటే మీకు దగ్గరలో ఉన్న ఆస్పత్రి వెళ్లి డాక్టర్‌ను సంప్రదించాలి.


No comments

Powered by Blogger.