Latest

Loading...

Corona virus : ఒక డోసు తీసుకున్న తర్వాత కరోనా వస్తే..? డాక్టర్స్ ఏం చెప్పారో తెలుసా..?


Corona virus

ఇక రెండవ వేవ్ చాలా జోరుగా ఉందని, దీని మ్యుటేషన్ కూడా డేంజరస్ అని అంటున్నారు. మరి ఇదే ఇలా ఉంటే ఇపుడు మూడవ దశ గురించి చర్చ వస్తోంది. మహారాష్ట్ర లో మూడవ దశ ఆగస్ట్ నాటికి వస్తుందని అంటున్నారు. మరి రెండవ దశను చూసిన వారికి మూడవ దశ మరెంత భీకరంగా ఉంటుందో అన్న కంగారు అయితే ఉంది. అయితే సాధారణంగా కొవాగ్జిన్ అయితే తొలి డోసు తర్వాత నాలుగు వారాలకు రెండో డోసు వేసుకోవాలి. అదే కొవిషీల్డ్ అయితే 6-8 వారాల మధ్య తీసుకోవచ్చు. కానీ తొలి డోసు తీసుకున్న తర్వాత కరోనా వస్తే.. ఇలా చేయడం కుదరదు. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత 2-4 వారాల మధ్యే ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి.

ఇక ఈ మధ్యే కొవిడ్ బారిన పడి కోలుకున్న వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవాలంటే కనీసం 1 నుంచి 3 నెలలు ఆగాల్సి ఉంటుంది. వ్యాక్సిన్లు వేసుకునే వాళ్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ దాడి చేయదని కాదు. కానీ ఈ వ్యాక్సిన్లు కొవిడ్ తీవ్రతను తగ్గిస్తాయి. మరీ తీవ్రమైన లక్షణాలు లేకుండా, ఆసుపత్రి అవసరం రాకుండా చేయడంలో వ్యాక్సిన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడితే.. ప్రస్తుతానికి మళ్లీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.

 ఇక కరోనా ఉన్నా లక్షణాలు లేని వ్యక్తి వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందో అన్న భయం కూడా కొంత మందిలో ఉంది. కానీ అలాంటి వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఎలాంటి దుష్ప్రభావాలనూ చూపదని డాక్టర్లు చెబుతున్నారు. సహజంగానే కొందరిలో వైరస్‌ను ఎదురించే స్థాయిలో యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయి. మరికొందరిలో వ్యాక్సిన్ ఆ పని చేస్తుంది. ఇక సహజంగా ఉత్పన్నమయ్యే యాంటీ బాడీల కంటే వ్యాక్సిన్ల వల్ల వచ్చేవి ఎక్కువ కాలం ఉంటాయి.


No comments

Powered by Blogger.