Latest

Loading...

Corona: గుడ్‌న్యూస్‌: ఈ ఒక్క ఇంజక్షన్‌తో కరోనాకు చెక్..!

Corona

 కరోనా రోగులకు ఓ గుడ్‌ న్యూస్.. ఇప్పుడు కరోనా చికిత్స కోసం ఓ కొత్త ఔషధం వచ్చేసింది. ఇంజక్షన్ రూపంలో ఈ ఔషధం దొరుకుతోంది. ఈ ఇంజక్షన్ ఒక్క డోస్ వేస్తే చాలు.. వారం రోజుల్లో కరోనా నుంచి కోలుకుంటారు. అవును.. ఇది నిజమే.. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ఇంతకీ ఆ ఇంజక్షన్ ఏంటి.. దాని కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం.


ఈ ఇంజక్షన్ పేరు 'మోనోక్లోనల్‌ యాంటీబాడీ.. దీన్ని కాక్‌టెయిల్‌ యాంటీబాడీ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఇంజక్షన్‌తో మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయి. భారత ప్రభుత్వం తాజాగా ఈ చికిత్సకు అనుమతించింది. ఈ ఇంజక్షన్‌తో కరోనా రోగులు 7-10 రోజుల్లో పూర్తిగా కోలుకుంటున్నారు.


రోగుల శరీరం నుంచి వైరస్‌ మటుమాయమవుతుంది. ఇప్పుడు ఈ చికిత్స హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్నవారికి ఈ ఇంజక్షన్ ఇస్తే.. ఎక్కవ ప్రయోజనం ఉంటుందని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి తెలిపారు.


65 ఏళ్లు దాటిన వారికి, స్థూలకాయులకు అంటే 'బాడీ మాస్‌ ఇండెక్స్‌' 35 కంటే ఎక్కువగా ఉన్నవారికి ఈ ఇంజక్షన్ బాగా ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి పీడితులకు, ఎంతోకాలంగా మధుమేహానికి చికిత్స పొందుతున్నవారికి కరోనా వస్తే ఈ ఇంజక్షన్ ప్రాణదాతగా చెప్పుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని తగ్గించే ఔషధాలను వినియోగిస్తున్నవారికి అంటే.. క్యాన్సర్‌ రోగులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారికి కూడా ఈ ఇంజక్షన్ ఇవ్వొచ్చని నాగేశ్వరరెడ్డి తెలిపారు.


55 ఏళ్లు దాటి అధిక రక్తపోటు, గుండెజబ్బు ఉన్న బాధితులకు కూడా ఈ ఇంజక్షన్ ఇవ్వొచ్చు. క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌, ఆస్తమాతో బాధపడుతున్నవారికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ముప్పు తీవ్రత ఉంటే 12 ఏళ్లు దాటిన వారికి, బాలింతలకు కూడా ఈ ఇంజక్షన్ ఇవ్వవచ్చని చెబుతున్నారు. తాజాగా హరియాణలో ఓ 84 వృద్ధుడు ఈ ఇంజక్షన్ ద్వారా కోలుకున్నారు. దీని విలువ రూ. 60 వేల వరకూ ఉంటుంది


No comments

Powered by Blogger.