Latest

Loading...

Coronavirus : ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ .....

Coronavirus

 కొవిడ్‌-19 శ్వాసకోశ వ్యాధి అయినప్పటికీ, మ్యూక‌స్ ఉత్ప‌త్తిని పెంచడంలో దాని పాత్ర కారణంగా ధూమపానం మొద‌టి రక్షణ వరుసగా పనిచేస్తుందని సర్వే సూచించింది. అయినప్పటికీ, కరోనావైరస్ ఇన్‌ఫెక్ష‌న్‌పై ధూమపానం, నికోటిన్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి కేంద్రీకృత యాంత్రిక అధ్యయనాల అవసరం ఉన్న‌దని ఈ ప‌రిశోధ‌న‌ హెచ్చరించింది. అయితే, “ధూమపానం ఆరోగ్యానికి తీవ్ర హానికరం, ప‌లు వ్యాధులతో సంబంధం కలిగి ఉన్న‌ది. ఈ పరిశీలనను ఆమోదంగా తీసుకోకూడదు” అని ప‌రిశోధ‌కులు నొక్కి చెప్పారు.
ఇక‌, బ్లడ్ గ్రూప్ ‘ఓ’ ఉన్నవారు కూడా ఇన్‌ఫెక్షన్ బారిన పడే అవకాశం త‌క్కువ‌గా ఉన్న‌దని, బీ, ఏబీ ర‌క్తం ర‌కాలు ఎక్కువ ప్రమాదం క‌లిగి ఉంటాయని సర్వేలో తేలింది. బ్లడ్ గ్రూప్ రకం ఏబీకి సెరో-పాజిటివిటీ అత్యధికంగా ఉంటుంద‌ని, బీ గ్రూప్ తర్వాత బ్లడ్ గ్రూప్ ఓ తక్కువ పాజిటివిటీ రేటుతో సంబంధం కలిగి ఉంటుందని తేలింది.
కొవిడ్‌-19 పాజిటివ్‌కు అమెరికాలో 7,000 మందికి పైగా పరీక్షించిన సెంటర్‌ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనం కూడా ఇలాంటి ఫలితాలనే కనుగొన్న‌ది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 1.3 శాతం మంది మాత్రమే ధూమపానం చేస్తున్నారని, సీడీసీ నివేదికతో పోల్చితే మొత్తం అమెరికన్లలో 14 శాతం మంది ధూమపానం చేస్తున్న వారున్నారు.
అదేవిధంగా, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ విద్యావేత్తలు యూకే, చైనా, ఫ్రాన్స్, యూఎస్ అంతటా 28 ప‌రిశోధ‌నా ప‌త్రాల‌ను ప‌రిశీలించగా.. ఆసుపత్రి రోగుల్లో ధూమపానం చేసేవారి నిష్పత్తి ఊహించిన‌ దానికంటే తక్కువగా ఉన్న‌దని కనుగొన్నారు.
యూకేలో కొవిడ్‌-19 రోగులలో ధూమపానం చేసేవారి నిష్పత్తి కేవలం ఐదు శాతం మాత్రమే. ఇది జాతీయ రేటు 14.4 శాతంలో మూడవ వంతు.
ఫ్రాన్స్‌లో ఈ రేటు నాలుగు రెట్లు తక్కువగా ఉన్న‌ది.
చైనాలో అక్క‌డి జనాభాలో సగానికి పైగా క్రమం తప్పకుండా సిగరెట్లు తాగుతున్న వారు ఉన్న‌ప్పటికీ 3.8 శాతం మంది రోగులు మాత్రమే ధూమపానం చేస్తున్నారని ఒక అధ్యయనం పేర్కొన్న‌ది.

No comments

Powered by Blogger.