Latest

Loading...

Coronavirus కరోనాతో సహజీవనం చేయాల్సిందే: సీఎం జగన్

Coronavirus

 దేశంలో-రాష్ట్రాల్లో్ వ్యాక్సిన్ల కొరత ఉన్నందున.. కొవిడ్‌తో సహజీవనం తప్పదని సీఎం జగన్ మరోసారి వ్యాఖ్యానించారు. గురువారం వైఎస్సార్ రైతు భరోసా కింద మొదటి విడత నిధులను వర్చవల్ ద్వారా విడుదల చేసిన జగన్ అనంతరం వ్యాక్సిన్‌పై మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 18 ఏండ్ల పై బడిన వారికి 172 కోట్ల డోసులు అవసరమని.. కానీ, ప్రస్తుతం 18 కోట్ల డోసులు మాత్రమే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఏపీకి 7 కోట్ల డోసులు అవసరమని.. ఇప్పటివరకు వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం, వ్యాక్సిన్ కంపెనీలు 73 లక్షల డోసుల మాత్రం పంపిణీ చేశారన్నారు.

"ప్రస్తుతం దేశం-రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత దారుణంగా ఉందని సీఎం జగన్ తెలిపారు."

ఇందుకు కారణం రెండే కంపెనీలు వ్యాక్సిన్లు తయారుచేయడమని.. ఒకటి భారత్ బయోటెక్ నెలకు కోటి వ్యాక్సిన్లు మాత్రమే తయారు చేస్తే.. పూణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ 6 కోట్ల వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తోందన్నారు. ఈ రెండు ఫార్మా కంపెనీలు నెలకు మొత్తంగా 7 కోట్ల వ్యాక్సిన్లను మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సామర్థ్యం కలిగిఉన్నాయని.. ఇటువంటి పరిస్థితుల్లో కొవిడ్‌తో సహజీవనం తప్పా మరో మార్గం లేదని జగన్ మరోసారి చెప్పుకొచ్చారు. అందుకే ఓ వైపు జాగ్రత్తలు తీసుకుంటూనే కరోనాతో సహజీవనం చేస్తూ యుద్ధం చేయాలని ప్రజలకు సూచించారు.

No comments

Powered by Blogger.