Covaccine vs covishield : కోవాక్సిన్ వేసుకోవాలా.. ? కోవిషీల్డ్ వేసుకోవాలా.. ?
ఇయితే ఇప్పుడు అందరిలో ఉన్న సందేహం కోవాక్సిన్ వేసుకోవాలా..? లేదంటే కోవిషీల్డ్ వేసుకోవాలా..? ఈ రెండు వ్యాక్సిన్ లు కూడా వైరస్ ను క్రియారహితంగా చేయడానికి రూపొందించిన వ్యాక్సిన్ లే. కోవిషీల్డ్ ను సార్స్ కోవ్-2 లోని స్పైక్ గైకోప్రోటీన్ భాగం నుండి తీసుకున్న జన్యుపధార్థంతో తయారు చేశారు. ఇది ఒక వైరల్ వెక్టర్ వ్యాక్సిన్ అంటే మరో వైరస్ ను వాహకంగా చేసకుని పనిచేస్తుంది. ఇదిలా ఉండగా కోవాక్సిన్ ను సార్స్ కోవ్-2 మొతం తో తయారు చేసారు. దీన్ని వైరస్ జన్యుపదార్థాలకు పునరుత్పత్తిని లేకుండా అచేతనం చేసి వ్యాక్సిన్ ను తయారు చేశారు.
రెండింటిలో ఏ వ్యాక్సిన్ మెరుగైంది :
ఈ రెండు వ్యాక్సిన్ లను భారత్ లోనే తయారు చేశారు. అయితే వీటిలో కోవిషీల్డ్ ఎక్కువ దేశాల్లో గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు కోవాక్సిన్ ఇప్పుడు ఉత్పరివర్త జాతులకు వ్యతిరేకంగా పనిచేసే ప్రభావవంతమైన వ్యాక్సిన్ గా గుర్తించబడుతుంది.
ఎన్నిడోసులు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి:
ఈ రెండు వ్యాక్సిన్ లను కండరాలకు ఇస్తారు. కోవాక్సిన్ మొదటి డోసు వేసుకున్న 4-6 వారాలకు రెండో డోస్ ఇస్తారు. కోవిషీల్డ్ మొదటి డోస్ వేసుకున్న 6-8 వారాలకు రెండో డోసును ఇస్తారు.
No comments