Latest

Loading...

Gas Cylinder Discount: గ్యాస్ సిలిండర్ పై రూ. 800 భారీ తగ్గింపు...మరో నాలుగు రోజుల వరకే ఛాన్స్.

Gas Cylinder Discount

 ఈ కరోనా కష్ట కాలంలో గ్యాస్ సిలిండర్ ధరలు పేదల పాలిట గుదిబండలాగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 861గా ఉంది

కరోనా దెబ్బకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అనేక మంది గ్యాస్ సిలిండర్ ను ఇంత ధరతో బుక్ చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.

గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు తెలిపింది. అంటే రూ. 61కే సిలిండర్ పొందే అవకాశం ఉంటుంది

ఈ ఆఫర్ ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మొదటి సారి పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి మాత్రంమే ఈ ఆఫర్వ వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది

ఈ ఆఫర్ పొందడం కోసం గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.

1.మొదటగా పేటీఎం యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అనంతరం 'Recharge and Pay Bills' ఆప్షన్ పై క్లిక్ చేయాలి

2. తర్వాత మీకు 'book a cylinder' ఆప్షన్ మీకు కనిపిస్తుంది. అనంతరం మీ గ్యాస్ ప్రొవైడర్ ను ఎంచుకుని మీ వివరాలు నమోదు చేయాలి.

3. అనంతరం 'Proceed to Pay' ఆప్షన్ పై క్లిక్ చేసి బిల్ చెల్లించాలి, ఇలా మొదటి సారి బుక్ చేసిన వారికి అటోమెటిక్ గా ఆఫర్ అప్లై అవుతుంది

4.గ్యాస్ సిలిండర్ బుకింగ్ అనంతరం స్క్రాచ్ కార్డు వస్తుంది. ఆ స్క్రాచ్ కార్డును ఓపెన్ చేసి క్యాష్ బ్యాక్ ను పొందొచ్చు

5. క్యాష్ బ్యాక్ రూ. 10 నుంచి రూ.800 ఎంతైనా రావొచ్చు. స్క్రాచ్ కార్డును 7 రోజుల్లోగా వినియోగించాల్సి ఉంటుంది

No comments

Powered by Blogger.