Government School 'నాడు - నేడు'తో ప్రభుత్వ బడులకు కొత్తరూపు
రాష్ట్ర ప్రభుత్వం 'నాడు-నేడు' నిధులతో చేపట్టిన పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపు మారింది. మౌలిక వసతులు సమకూరాయి. పిల్లలు బడులకు వచ్చేలా ఆకర్షణీయంగా తయారయ్యాయి. పాడేరు ఏజెన్సీలో గిరిజన సంక్షేమ, ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలల్లో అదనపు భవనాలు, మౌలిక వసతుల కల్పనకు రూ.104 కోట్లును ప్రభుత్వం విడుదల చేసింది. పాడేరు ఐటిడిఎ పరిధిలో మనబడి నాడు - నేడు కింద 115 ఆశ్రమ పాఠశాలలు, 42 జిపిఎస్, 11 గురుకులాలు, జిల్లా పరిషత్, ప్రాథమికోన్నత, మండల పరిషత్ పాఠశాలలతో కలిపి 367 పాఠశాలలను ఆ నిధులతో తీర్చి దిద్దారు. మరుగుదొడ్లు వినియోగం లోకి వచ్చాయి. తాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది.
మన బడి నాడు - నేడు నిధులతో ఏజెన్సీ పాఠశాలల్లో వసతులు, చదువుకునే వాతావరణం మెరుగుపడటంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
No comments