Latest

Loading...

Jobs ఇంటర్ పాసైన వాళ్లకు గుడ్ న్యూస్... రూ.35,000 వేతనంతో జాబ్స్..?

Jobs

 యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 51 మైనింగ్ మేట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఇంటర్ పాసైన విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం


ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారికి దాదాపు రూ.35,000 వేతనం లభిస్తుంది.


http://www.ucil.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్ అర్హతతో పాటు డీజీఎంఎస్‌ జారీ చేసిన మెటాలిఫెరస్‌ మైన్స్‌ మైనింగ్‌ మేట్‌ కాంపిటెన్సీ సర్టిఫికెట్‌ కచ్చితంగా ఉండాలి.


డీఆర్డీవోలో 47 ఉద్యోగ ఖాళీలు.. పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా..? May 26, 2021

ప్రముఖ కంపెనీలో ఉద్యోగ ఖాళీలు.. మే31 వరకు..? May 25, 2021

కనీసం సంవత్సరం అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక భాష చదవడం, రాయడంలో ప్రొఫీషియన్సీ ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారు. 2021 సంవత్సరం ఏప్రిల్ 30 నాటికి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన తేదీ నుంచి 20 రోజుల్లోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.


http://www.ucil.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అర్హతలు ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్ పాసై అర్హతలు ఉన్నవాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

No comments

Powered by Blogger.