Latest

Loading...

Lemon health benefits :నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా...!

 

Lemon health benefits

నిమ్మకాయ. సిట్రస్ జాతికి చెందిన ఈ నిమ్మ చెట్టు కాయలతో మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడే సుగుణాలతోపాటు, అందాన్ని ఇనుమడింపజేసే లక్షణాలు కూడా ఈ నిమ్మలో ఉన్నాయి. నిమ్మకాయలు సీజనల్‌ రోగాలు ధరిచేరకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎండా కాలంలో ఒంట్లో వేడిని తగ్గించడానికీ తోడ్పడుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే నిమ్మతో లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా..!


నిమ్మతో ప్రయోజనాలు👌

నిమ్మరసం యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది.

నిమ్మలో కావాల్సినంత సి విటమిన్ లభిస్తుంది.

తరచూ నిమ్మరసం తీసుకునే వారిలో వయసు పెరుగుతున్నా చర్మం అంత త్వరగా ముడుతలు పడదు.

దీంతో వృద్ధాప్య చాయలు త్వరగా దరిచేరవు.

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొంచెం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడి తగ్గి, నూతన ఉత్సాహం వస్తుంది.

పంటినొప్పిని తగ్గించడంలో కూడా నిమ్మరసం తోడ్పడుతుంది. చిగుళ్లలోంచి రక్తం వచ్చేవారు తరచూ నిమ్మరసం తీసుకోవడంవల్ల ప్రయోజనం ఉంటుంది.

మన కాలేయంలో పేరుకున్న విష పదార్థాలను తొలగించి, శుద్ధి చేయడంలో నిమ్మరసం మంచి ఉపకారిగా పనిచేస్తుంది.

వేసవిలో నిమ్మరసం తాగితే అలసట నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

స్థూల కాయం ఉన్నవారు ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది.

నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించడంలో కూడా తోడ్పడుతుంది.



No comments

Powered by Blogger.