Latest

Loading...

Mango benefits:పండ్ల రారాజు మామిడితో ...లాభాలెన్నో

 


మామిడి పండులో విటమిన్లు, ప్రీబయోటిక్ డైటరీ పీచుపదార్థాలు, పాలీ ఫెనోలిక్ ఫ్లేవానోయిడ్ ఖనిజాలు కలిగి ఉంటాయి.


వీటిలో ఏ, సీ, డీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మొత్తం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. మామిడిపండ్లను పండుగా లేదా రసాలను తీసి జ్యూస్ గా/షేక్స్ లాగా కూడా సేవించవచ్చును. ఎలా తిన్నా దాని ఆరోగ్య ప్రోత్సహక లక్షణాల ఫలితాన్ని పొందుతారు.


ఆరోగ్య ప్రయోజనాలు..


మామిడి పండులో బెటా కెరోటిన్ అనే పదార్దం సమృద్ధిగా ఉండి మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది.


ఈ పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉండి వీటిని తినడం వలన రక్తహీనత సమస్య నుంచి మంచి ఫలితాన్ని పొందవచ్చు.


ఈ పండులోని విటమిన్ ఏ తోపాటు లభించే కెరోటిన్.. దృష్టి నష్టాన్ని నివారించి.. వయసుకు సంబంధించిన కంటి వ్యాధులైన మాక్యులార్ డిజెనరేషన్, కంటిశుక్లం వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


ఈ పండ్లలో లభించే ఏ, సీ విటమిన్లు చర్మంపై ఉండే సూక్ష్మ రంధ్రాలను శుభ్రం చేసి మొటిమలు రాకుండా కూడా నిరోధిస్తాయి.


మామిడి పండ్లను తినడంవల్ల ఎముకలు విరగడాన్ని నివారించుకోవడమే కాకుండా ఎముక బలాన్ని మెరుగుపరిచి, ఎముక సాంద్రతను కూడా మెరుగుపర్చుకోవచ్చు.


వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తాయి. విటమిన్ సీ, ఫైబర్ శరీరంలో హాని చేసే కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.


ఈ పండులో ఎక్కువగా ఉండే ఫైబర్ జీర్ణవాహికలోని ఆహారాన్ని స్పటికలుగా విచ్చనం చేసి త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.


మామిడి పండ్లను తినడం వల్ల ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెరుగవు. కానీ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఫైబర్, విటమిన్ సీ, పెక్టిన్ వంటివి కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి సహాయ పడటమే కాకుండా మంచి ఎనర్జీని కూడా ఇస్తాయి.


మామిడి పండు తినడం వల్ల క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చు. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నివారించే సామర్ధ్యం వీటికి ఉన్నదని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా పురుషుల్లో కనిపించే ల్యుకేమియా, ఇతర రకాల క్యాన్సర్లను ఎదుర్కొనే శక్తి మామిడిపండ్లలో ఉంటుంది.


మామిడిపండ్లలో ఉండే సిట్రిక్ యాసిడ్.. మన శరీరంలో ఎసిడిక్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.


మామిడి పండు తినడం వల్ల దంత సమస్యలు తొలగిపోతాయి. నోటిలోని బ్యాక్టీరియా నశింపజేసి దంతాలను ధృడంగా చేస్తుంది. పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.




No comments

Powered by Blogger.