Musk melon : కర్బూజా పండు .. పోషకాలు మెండు
మండే ఎండల్లో కాసేపు తిరిగినా బాగా అలసిపోతాం. అప్పుడు శీతల పానీయాలవైపు వెళ్లకుండా ఎక్కువ నీటిశాతం ఉన్న పండ్లను తీసుకుంటే మంచిది. ఇలాంటి పండ్లలో కర్బూజ ఒకటి. ఇందులో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. దప్పిక తీర్చటంతో పాటు శరీరంలోని నీటిశాతాన్ని కాపాడి తక్షణ శక్తినిస్తుంది. కర్బూజలో కొలెస్ట్రాల్ ఉండదు. వేసవిలో విరివిగా లభించే కర్బూజా వల్ల ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి.
- కర్బూజాలో పుష్కలంగా ఉండే విటమిన్లు ఎ, సి శరీరంలోని ఫ్లూయిడ్లను బ్యాలెన్స్ చేస్తాయి. ఒక కప్పు కర్బూజ ముక్కల్ని తింటే 40 శాతం లైకోపెన్ లభిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు దరి చేరవు. అధిక రక్తపోటు తగ్గించటంతో పాటు రక్తంలోని చక్కెర శాతాన్ని బ్యాలెన్స్
- కంటి ఆరోగ్యానికి, శ్లేష్మాన్ని తగ్గించడానికి కర్బూజా సహాయపడుతుంది. వేసవిలో కర్బూజా పండు ముక్కలతో పాటు జ్యూస్ తాగటం వల్ల మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు.
- అజీర్తి, ఎగ్జిమా, యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలకు కర్బూజా చక్కటి పరిష్కారం.
- కర్బూజాలో అతి తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కర్బూజా విత్తనాల్లో ఉండే పొటాషియం బెల్లీఫ్యాట్ కరగడానికి సహాయపడుతుంది.
- కర్బూజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తెల్ల రక్తకణాల ఉత్పత్తికి, ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడుతుంది. సి విటమిన్ ఎలాంటి అల్సర్లనైనా నివారించడానికి సహాయపడుతుంది.
- కర్బూజాలో డైటరీ ఫైబర్ ఉంటుంది. దీన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు.
- మస్క్ మిలాన్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల నరాలు, కండరాలను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల హాయిగా నిద్రపడుతుంది.
- కర్బూజ డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది.
No comments