Neck blackness : మెడ నల్లగా ఉందా....? అయితే ఈ టిప్స్ పాటించి మంచి ఫలితం పొందండి.
మెడ నల్లగా ఉందా?
కొందరికి ముఖం తెల్లగా, మెడ నల్లగా ఉంటుంది. ఇందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. వాటినుంచి ఇలా బయటపడదాం..
నా లుగు బాదం పప్పులు రాత్రి నానబెట్టి, పొద్దునే వీటిని మిక్సీ పట్టి పేస్ట్‌లా చేయండి. దాన్ని మెడ చుట్టూ రాసి, చల్లటి నీటితో కడిగేయండి. * కీరా చర్మకణాలను రిపేర్ చేస్తుంది. కాబట్టి కీరా రసాన్ని లేదా తురిమిన కీరాను మెడకి పట్టించి మృదువుగా మర్దనా చేయండి. తర్వాత రోజ్ వాటర్‌తో శుభ్రం చేస్తే సరి. * బేకింగ్ సోడాలో నీటిని కలిపి పేస్ట్‌లా చేయండి.
దీన్ని మెడకు రాసి ఆరేవరకూ ఉంచి, చన్నీళ్లతో కడిగేయండి. అలోవెరా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలోవెరా జెల్‌ను మెడ చుట్టూ రాసి, మసాజ్ చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నలుపు తగ్గుతుంది
No comments