Latest

Loading...

Papaya Health benefits; బొప్పాయి పండు ....పోషకాలు మెండు....

Papaya health benefits

 పసిడి వర్ణంతో మెరిసిపోయే ఈ పండు ఎన్నో పోషకాలను అందిస్తుంది. అలసటను తగ్గించడం దగ్గరి నుంచి రోగనిరోధకతను పెంచడం వరకూ ఈ పండు ప్రత్యేకతలు ఎన్నో.

* బొప్పాయిలో విటమిన్‌-ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫోలేట్‌ మూలకాలుంటాయి.

* దీనిలోని విటమిన్‌-సి దంతాలు, చిగుళ్ల సమస్యలను తగ్గించడంతోపాటు రోగనిరోధకతను పెంచడానికి సాయపడుతుంది. దీన్ని తరచూ తీసుకుంటే రకరకాల జబ్బుల బారిన పడకుండా ఉంటాం.

* ఈ పండులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, పీచు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.


అధిక రక్తపోటును నియంత్రిస్తాయి.

* బొప్పాయిలో నీటి శాతం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది త్వరగా జీర్ణమవడమే కాకుండా కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గిస్తుంది.

* ఈ ఫలం నుంచి అందే కెలొరీలు చాలా తక్కువ. బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండు చక్కటి ఎంపిక. దీన్ని తరచూ తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి.

* బొప్పాయి పండును ఆహారంలో చేర్చుకుంటే ఉదర సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి.

* ఎక్కువ మొత్తంలో విటమిన్‌-ఎ లభించే పండు బొప్పాయే. దీంట్లోని బీటా కెరొటిన్‌ కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

* బొప్పాయి గుజ్జును ముఖానికి పూతలా వేసుకుని అరగంట తర్వాత కడిగేస్తే మోము మెరుస్తుంది.


No comments

Powered by Blogger.