pride of cow milk : సెలబ్రిటీలు తాగే ఈ పాల స్పెషాలిటీ ఏమిటో తెలుసా l
pride of cow milk rate :పాలు అనగానే మనకు గేదె పాలు,ఆవుపాలు,మహా అయితే గొర్రెపాలు ఇలాగే తెలుసు. పుట్టిన దగ్గర నుంచి ప్రతిఒక్కరికీ పాలు అవసరమే చిక్కటి పాలు టీసుకొచ్చినందుకు కొంచెం ఎక్కువ రేటు చెల్లిస్తాం. అయితే ఇప్పుడు పాల ఫ్యాక్టరీలు రావడం,అందరూ పాల పాకెట్స్ కి అలవాటు పడిపోవడం చూస్తున్నాం. ఎందుకంటే కల్తీలేని పాలు దొరకడం కష్టంగా మారడం వలన పాకెట్ పాలపై ఆధారపడిపోతున్నారు. అందుకే పౌష్టికాహారం అందడం లేదు. వీటిని దృష్టిలో పెట్టుకుని పూణేకు దగ్గరలో భాగ్యలక్ష్మి డైరీ ఒకటి అంత్యంత నాణ్యమైన పాలను అందిస్తోంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం వీటివైపు మొగ్గుచూపుతారు. ఒకసారి వాటి వివరాల్లోకి వెళ్తే,భీమేశ్వరి హిల్స్ మధ్యన గల ఈ డైరీ ఫార్మ్ 26ఎకరాల్లో విస్తరించింది.
మంచి గడ్డి ఎక్కువగా వుండే ఈ ప్రాంతంలో PRIDE OF COW పేరుతో డైరీ ఫార్మ్ ఏర్పాటుచేశారు. పెడిగ్రీ గల స్పిష్ పోలిస్టిం,ఫ్రీషియన్ ఆవులు ఇక్కడ ఉన్నాయి. మంచి గడ్డి ఆలాగే చక్కని విటమిన్స్ అందడానికి వీలుగా హై క్వాలిటీ పెన్నీసిటం,సోయా, తవుడుని ఆటోమెషిన్ ద్వారా అందించే ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. ఆవులు స్వేచ్ఛగా తిరిగేలా వదిలేయడం,హాయిగా నిద్రపోడానికి ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు ఇక్కడ స్పెషాలిటీ. ఇక పాలు పిండడం మొదలు,బాటిల్స్ నింపేవరకూ అన్నీ ఆటోమేటిక్ పద్దతిలోనే కొనసాగుతాయి.
ఇలా చాలా శ్రద్హతో పాలను అందించడం వలన అంబానీ, అమితాబ్, సచిన్ టెండూల్కర్,హృతిక్,అక్షయ కుమార్ ఇలా ఎందరో సెలబ్రిటీలు ఈ డైరీ కస్టమర్లు అయ్యారు. ఇక ఫార్మ్ టు హౌస్ పేరిట 2011లో స్పెషలైజెడ్ సేవలను కూడా ఈ డైరీ మొదలు పెట్టింది. ముంబయ్ , పూణేకు మాత్రమే ఈ సర్వీసులు ప్రస్తుతానికి పరిమితం అయ్యాయి. ప్రస్తుతం 20వేలమంది కష్టమర్లుగా ఉన్నారు. అయితే ఇంతగా నాణ్యత గల పాలు చాలా రేటు అనుకుంటున్నారా? కాదండి, కేవలం లీటరు పాలు90రూపాయలకే లభిస్తాయి. అదికూడా నేరుగా ఇంటికి సప్లయ్ చేస్తున్నారు.
No comments